Narendra Modi: భూటాన్ లో తనకు ఘనస్వాగతం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మోదీ

  • భూటాన్ పర్యటనకు తరలి వెళ్లిన మోదీ
  • రెండ్రోజుల పాటు పర్యటన
  • భూటాన్ ప్రధాని ఆదరణ మనసుకు హత్తుకుందన్న మోదీ
 భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కోసం భూటాన్ తరలివెళ్లారు. ఆయనకు పారో విమానాశ్రయంలో భూటాన్ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. భూటాన్ ప్రధానమంత్రి డాక్టర్ లొటాయ్ షెరింగ్ స్వయంగా విచ్చేసి మోదీకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేస్తూ, తన పట్ల భూటాన్ ప్రధాని చూపిన ఆదరణ హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు. ఇది ముఖ్యమైన పర్యటనగా భావిస్తున్నానని, విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికిన భూటాన్ ప్రధాని షెరింగ్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. కాగా, భూటాన్ పర్యటనలో భాగంగా భారత్ 10 ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది.
Narendra Modi
Bhutan

More Telugu News