Jagan: సీఎం జగన్ కాళ్లు పట్టుకునైనా ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తా... ఎస్వీబీసీ సిబ్బందికి భరోసా ఇచ్చిన పృథ్వీరాజ్

  • తిరుపతిలో మీడియా సమావేశం
  • ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286 మంది ఉద్యోగుల్లో ఎవరికీ అన్యాయం జరగదన్న పృథ్వీ
  • ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాక ఆధార్, ఓటర్ కార్డులను తిరుపతికి మార్చుకున్నానంటూ వెల్లడి
ఇటీవలే శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)కి చైర్మన్ గా నియమితుడైన సినీ నటుడు పృథ్వీరాజ్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ కాళ్లు పట్టుకునైనా ఎస్వీబీసీ సిబ్బంది ఉద్యోగాలను పర్మినెంట్ చేయిస్తానని మాటిచ్చారు. ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286 మంది ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని స్పష్టం చేశారు.

త్వరలో ఎస్వీబీసీ చానల్ ప్రసారాలు హిందీలోనూ తీసుకువచ్చేందుకు ప్రయతిస్తున్నట్టు తెలిపారు. తాను తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, తిరుమల క్షేతంలో రాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు. ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆధార్, ఓటర్ కార్డులను తిరుపతికే మార్చుకున్నానని చెప్పారు.
Jagan
Prudhviraj
SVBC
Tirumala
Tirupati
Tollywood

More Telugu News