Bollywood: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పెద్ద మనసు.. వరద బాధితుల కోసం 500 ఇళ్ల నిర్మాణం!

  • కొత్త ఇళ్లను కట్టించి ఇవ్వాలని నిర్ణయం
  • వరదలకు అతలాకుతలమైన మహారాష్ట్ర
  • ప్రజలు కూడా సాయం చేయాలని నానా పిలుపు
సేవా కార్యక్రమాల్లో ముందుండే బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వందలాది మంది ప్రజల ఇళ్లు పూర్తిగా దెబ్బతినడంతో వాళ్లందరికీ నిలువనీడ లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకుని చలించిపోయిన నానా పటేకర్.. వరద బాధితులకు 500 ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయమై నానా పటేకర్ మీడియాతో మాట్లాడుతూ..‘నేను షిరోల్‌కు వచ్చినప్పుడు, అక్కడి పరిస్థితిని చూశాను, అందుకే మేం 500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. అలాగే తక్లేవాడీ ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లను కూడా తాము పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందరినీ ఆదుకోవడం సాధ్యం కాదనీ, ఈ విషయంలో ప్రజలు కూడా ముందుకు రావాలని నాని పటేకర్ పిలుపునిచ్చారు. 
Bollywood
nana patekar
Floods
500 houses
will be built
announced
Maharashtra
500 New houses

More Telugu News