India: పాకిస్థాన్ దొంగ దెబ్బ.. రేంజర్ల కాల్పుల్లో భారత జవాను వీరమరణం!

  • జమ్మూకశ్మీర్ లోని ఎల్వోసీ వద్ద ఘటన
  • అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించిన పాక్
  • వీరమరణం పొందిన లాన్స్ నాయక్ సందీప్ థాపా
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించుకుంది. జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట నౌషేరా, రాజౌరీ సెక్టార్లలో భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ అకస్మాత్తుగా చేసిన ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన లాన్స్ నాయక్ సందీప్ థాపా అమరులయ్యారు. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను దీటుగా తిప్పికొడుతున్నాయి.

ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 6.30 గంటలకు పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని తెలిపారు. తేలికపాటి ఆయుధాలు, షెల్స్ ను పాక్ ప్రయోగిస్తోందని వెల్లడించారు. పాక్ దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని పేర్కొన్నారు. భారత బలగాలు ఇటీవల జరిపిన కాల్పుల్లో నలుగురు పాక్ రేంజర్లు చనిపోయారు. ఆ దాడికి ప్రతీకారంగానే పాక్ తాజా దుశ్చర్యకు దిగినట్లు తెలుస్తోంది.
India
Pakistan
Jammu And Kashmir
loc
LOC
Cease fire violation
indian soilder
dead

More Telugu News