Andhra Pradesh: చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ వ్యవహారం.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!

  • పోలీసులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
  • ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం
  • తొక్కిసలాటలో టీడీపీ కార్యకర్తలకు గాయాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గరకు దేవినేని ఉమ, వర్ల రామయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆలపాటి రాజాతో పాటు చాలామంది టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి.

పోలీసులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ  చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
Andhra Pradesh
Chandrababu
house
drones
Police
lathi charge
Undavalli
Guntur District

More Telugu News