త్వరలో అరటి పండ్లు మాయం కానున్నాయా?
- అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
- ప్రమాదకర ఫంగస్ విస్తరిస్తోందని ఆందోళన
- ఒకసారి వ్యాపిస్తే ఇక అంతే సంగతులు
ఇందులో కావెండిష్ అరటి ప్రత్యేకమైనది. ప్రపంచంలో అత్యధికంగా సాగయ్యేది కూడా ఈ అరటే. ఈ అరటిని నాశనం చేసే టీఆర్-4 ఫంగస్ వేగంగా వ్యాపిస్తోంది. అరటి తోటల సాగుకు వినియోగించే ట్రాక్టర్ల టైర్ల ద్వారా, పొలంలో తిరిగే మనిషి బూట్ల ద్వారా ఈ ఫంగస్ వ్యాపిస్తోందని నిపుణులు గుర్తించారు. ఒకసారి పంటపై ఈ ఫంగస్ వ్యాపిస్తే అరికట్టడం అసాధ్యమని చెబుతున్నారు. ఈ ఫంగస్‌ను తట్టుకునే రసాయనాలు ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి.