bananaa: త్వరలో అరటి పండ్లు మాయం కానున్నాయా?

  • అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
  • ప్రమాదకర ఫంగస్‌ విస్తరిస్తోందని ఆందోళన
  • ఒకసారి వ్యాపిస్తే ఇక అంతే సంగతులు

అరటి పండు శ్రేష్టమైన పౌష్టికాహారంగా పేరొందింది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రోజూ ఓ అరటి పండు తింటే శరీరానికి కావాల్సిన శక్తి పుష్కలంగా అందుతుందని వైద్యులు చెబుతారు. పైగా జీర్ణక్రియను క్రమబద్ధీకరించే శక్తి దీనికుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న అరటి పండు కొన్నాళ్లకు పాఠాల్లో మాత్రమే కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత గిరాకీ ఉన్న కావెండిష్‌ అరటి పరిస్థితి ప్రమాదంలో ఉందంటున్నారు. ప్రపంచంలో వెయ్యికి పైగా అరటి జాతులుంటే అందులో 300 జాతులు మాత్రమే మనిషి తినేందుకు అనువుగా ఉంటాయి.

ఇందులో కావెండిష్‌ అరటి ప్రత్యేకమైనది. ప్రపంచంలో అత్యధికంగా సాగయ్యేది కూడా ఈ అరటే. ఈ అరటిని నాశనం చేసే టీఆర్‌-4 ఫంగస్‌ వేగంగా వ్యాపిస్తోంది. అరటి తోటల సాగుకు వినియోగించే ట్రాక్టర్ల టైర్ల ద్వారా, పొలంలో తిరిగే మనిషి బూట్ల ద్వారా ఈ ఫంగస్‌ వ్యాపిస్తోందని నిపుణులు గుర్తించారు. ఒకసారి పంటపై ఈ ఫంగస్‌ వ్యాపిస్తే అరికట్టడం అసాధ్యమని చెబుతున్నారు. ఈ ఫంగస్‌ను తట్టుకునే రసాయనాలు ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి.

More Telugu News