గ్రీన్ ల్యాండ్ ను కొనేద్దాం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన!
- తన సలహాదారులతో చర్చించిన ట్రంప్
- భారీగా సహజవనరులు ఉండటమే కారణం
- గతంలో అమెరికా కోరినా అమ్మని డెన్మార్క్
8.36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణం, 56,000 వేల జనాభా ఉన్న గ్రీన్ ల్యాండ్ డెన్మార్క్ లోని ప్రాంతం. ఈ ద్వీపం డెన్మార్క్ లో భాగమైనప్పటికీ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఉంది. 1867లో అలాస్కాను అప్పటి రష్యన్ చక్రవర్తుల నుంచి అమెరికా కొనుగోలు చేసింది.
అనంతరం 1946లో గ్రీన్ ల్యాండ్ ను తమకు అమ్మితే 712.54 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే ఎందుకో అప్పట్లో ఇది కుదరలేదు. కాగా, ట్రంప్ ప్రతిపాదనపై ఇటు అమెరికా, అటు డెన్మార్క్ ప్రభుత్వ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చే నెలలో డెన్మార్క్ లో పర్యటించనున్నారు.