Andhra Pradesh: అనంతపురంలో టీడీపీ ఆందోళన.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అరెస్ట్!

  • అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ ఆందోళన
  • రాయదుర్గంలో ఆందోళన చేపట్టిన కాలవ
  • అడ్డువచ్చిన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ
ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తెరవాలని టీడీపీ ఉద్యమిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు ఈ విషయమై ఆందోళనకు దిగాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. పేదలకు రూ.5కే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు కాలవ శ్రీనివాసులతో పాటు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వీరిని స్టేషన్ కు తరలిస్తుండగా మిగిలిన టీడీపీ కార్యకర్తలు పోలీసు జీపులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిపై  లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. అనంతరం కాలవ శ్రీనివాసులు, టీడీపీ కార్యకర్తలను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Andhra Pradesh
Anantapur District
Telugudesam
Kalava srinivasulu
arrest
Police
anna canteen

More Telugu News