prakasam barrage: 5.66 లక్షల క్యూసెక్కులకు చేరిన ఇన్‌ఫ్లో.. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • అర్ధరాత్రి నుంచి పెరిగిన ఇన్‌ఫ్లో
  • 5,65,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
  • ఇప్పటి వరకు 50 టీఎంసీల నీరు సముద్రం పాలు

ప్రకాశం బ్యారేజీకి గత అర్ధ రాత్రి నుంచి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెద్ద ఎత్తున పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి ఏకంగా 5,66,860 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి పడుతోంది. దీంతో అధికారులు ప్రమాద  హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు, బ్యారేజీ నుంచి దిగువకు 5,65,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టు వివరించారు. బ్యారేజీ నుంచి ఇప్పటి వరకు 50 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.  

More Telugu News