Nani: 'హొయినా హొయినా'... గ్యాంగ్ లీడర్ నుంచి మరో సాంగ్ రిలీజ్

  • నాని హీరోగా రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ చిత్రం
  • సెప్టెంబరు 13న విడుదల
  • తాజా గీతానికి సామాజిక మాధ్యమాల్లో స్పందన

స్వాతంత్ర్య దినోత్సవం నాడు గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'హొయినా హొయినా' అంటూ సాగే ఈ గీతం విడుదలైందంటూ హీరో నాని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఈ పాటకు సంబంధించిన లిరికల్ ట్రాక్ ను యూట్యూబ్ లో పోస్టు చేశారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ గీతానికి అనంత శ్రీరామ్, ఇన్నో గంగ (ఇంగ్లీషు పదాలు) సాహిత్యం అందించారు. ఇన్నో గంగ ఆలపించిన ఈ పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన కనిపిస్తోంది.

కాగా, వినూత్న కథాంశంతో వస్తున్న గ్యాంగ్ లీడర్ చిత్రంలో నానీతో పాటు సీనియర్ నటీమణులు లక్ష్మి, శరణ్య తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబరు 13న విడుదల కానుంది.

More Telugu News