culvert: సెల్ఫీ తీసుకుంటుండగా కూలిన కల్వర్ట్‌.. వరదలో కొట్టుకుపోయిన తల్లీకూతుళ్లు

  • ప్రాణాలు తీసిన సరదా
  • కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా ఫొటో కోసం ప్రయత్నం
  • హఠాత్తుగా కుంగిపోయిన కల్వర్టు
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువ కల్వర్టుపై నిల్చుని ఫొటో తీసుకోవాలన్న వారి సరదా ప్రాణాలమీదికి తెచ్చింది. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా హఠాత్తుగా కల్వర్టు కుంగిపోవడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన తల్లీకుమార్తెలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌ లోని మండ్‌సార్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్‌.డి.గుప్తా నిన్న కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని వరద కాలువను చూసేందుకు వెళ్లారు.

ఈ సందర్భంగా అతని భార్య బిందు గుప్తా (48), కుమార్తె ఆశ్రిత (21) కాలువ వద్ద సెల్ఫీ కోసం ముచ్చటపడ్డారు. కల్వర్టుపై నిల్చుని సెల్ఫీ తీసుకుంటూ ఉండగా వరద ఉద్ధృతి ఎక్కువై కల్వర్టు కూలిపోయింది. దీంతో దానిపై నిల్చున్న తల్లీకూతుర్లు కాలువలో పడి వరదలో కొట్టుకుపోయారు. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన స్థానికులు వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
culvert
Madhya Pradesh
accident
mother and daughter died

More Telugu News