Vijayawada: ప్రవాహంలో చిక్కుకున్న వృద్ధుడు : సాహసం చేసి కాపాడిన యువకుడు

  • ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి
  • నెహ్రూనగర్‌లోకి నీరు ప్రవేశం
  • నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయిన వృద్ధుడు
ప్రాణాలకు తెగించి ఓ యువకుడు చేసిన సాహసం కృష్ణమ్మ ప్రవాహంలో చిక్కుకుపోయిన ఓ వృద్ధుని ప్రాణాలు కాపాడింది. పులిచింతల జలాశయం నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో  ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పోటెత్తింది. భారీ వరదల ధాటికి నీటి ప్రవాహం కృష్ణలంక కనకదుర్గ వారధి పక్కన ఉన్న నెహ్రూనగర్‌లోకి ప్రవేశించింది. దీంతో ఆ కాలనీలోని ఓ వృద్ధుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అనుకోకుండా అతని చేతికి ఓ కర్ర దుంగ దొరకడంతో దాని సాయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సాయం కోసం వేచి చూస్తున్నాడు.

వృద్ధుడిని  గమనించిన ఓ యువకుడు ప్రవాహంలో ఎదురెళ్లి ఆ వ్యక్తిని కాపాడాడు. అయితే అప్పటికే నీటిలో చిక్కుకు పోవడం వల్ల వృద్ధుడి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ప్రాణాప్రాయం లేదని ప్రకటించారు. వృద్ధుడి ప్రాణాల కోసం సాహసం చేసిన యువకుడి ధైర్యాన్ని ప్రజలు కొనియాడారు.
Vijayawada
krishawater
oldman
youth

More Telugu News