BJP: బీజేపీ సీనియర్ నేత అద్వానీకి అస్వస్థత

  • వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న అద్వానీ
  • అద్వానీ నివాసంలో రేపటి పంద్రాగస్టు వేడుకలు రద్దు
  • ఓ ప్రకటనలో తెలిపిన అద్వానీ కార్యాలయం 
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దాదాపు ఐదు రోజులుగా వైరల్ ఫీవర్ తో ఆయన బాధపడుతున్నారు. కాగా, భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జెండా వందనం చేయడం ఆనవాయతి. అయితే, ప్రస్తుతం అద్వానీ అనారోగ్యం పాలవడంతో రేపు ఆయన నివాసంలో నిర్వహించాల్సిన పంద్రాగస్టు వేడుకలు నిర్వహించట్లేదు. ఈ విషయాన్ని అద్వానీ కార్యాలయం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, న్యూఢిల్లీలోని 30, పృథ్వీరాజ్ రోడ్డులో అద్వానీ నివాసం ఉంది.
BJP
Senior Leader
Advani
viral fever
Ill-health

More Telugu News