Khammam District: గన్ మెన్లను వెనక్కి పంపిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

  • నేను ఎప్పుడూ తప్పు చేయలేదు
  • నాకు ఎటువంటి ప్రాణ భయం లేదు
  • నా నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడీ లేదు
ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తనకు భద్రత కల్పించే గన్ మెన్ల అవసరం లేదన్నారు. దీంతో భద్రతా సిబ్బందిని తిరిగి వెనక్కి పంపారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, తనకు ఎటువంటి ప్రాణ భయం లేదని, అందుకే, గన్ మెన్లను నిరాకరిస్తున్నట్టు చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలే తనకు రక్షణగా నిలుస్తారని చెప్పిన రేగా, హంగూ ఆర్భాటాలతో ప్రజల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని, తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత సిబ్బంది ఆరుగురినీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని కోరారు. 
Khammam District
pinapaka
mla
Rega

More Telugu News