Vishwak Sen: విష్వక్సేన్ కొత్త చిత్రంగా 'పాగల్'

  • విభిన్న ప్రేమకథా చిత్రంగా 'పాగల్'
  • దర్శకుడిగా నరేశ్ రెడ్డి పరిచయం 
  • సెప్టెంబర్ 2వ వారం నుంచి షూటింగ్

ఈ మధ్య కాలంలో వచ్చిన 'ఫలక్ నుమా దాస్ ' చిత్రం హీరోగా విష్వక్సేన్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో ఇటు యూత్ లోను .. అటు మాస్ లోను ఆయన క్రేజ్ పెరిగింది.  

ఈ క్రమంలో విష్వక్సేన్ తదుపరి సినిమాగా 'పాగల్' పట్టాలెక్కనుందనేది తాజా సమాచారం. బెక్కమ్ వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేశ్ రెడ్డి కుప్పిలి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సందర్భంగా బెక్కమ్ వేణుగోపాల్ మాట్లాడుతూ .. "ఇది ఒక ప్రేమకథా చిత్రం .. దర్శకుడు కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఈ కథకు విష్వక్సేన్ సరిగ్గా సరిపోతాడు. సెప్టెంబర్ రెండవవారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నాము. మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తాము" అని అన్నారు.

More Telugu News