Andhra Pradesh: ఏపీలో పర్యాటక రంగ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు కల్పించాలి: కేంద్ర మంత్రికి అవంతి వినతి

  • ప్రహ్లాద్ సింగ్ ను కలిసిన అవంతి, విజయసాయిరెడ్డి
  • స్వదేశీ దర్శన్, ప్రసాదం స్కీమ్ ల కింద రూ.900 కోట్లు కేటాయించాలని కోరాం
  • మంత్రి సానుకూలంగా స్పందించారు: అవంతి

ఏపీలో పర్యాటక రంగ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ ను కోరినట్టు ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో ప్రహ్లాద్ సింగ్ ను అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు కలిశారు. ఈ మేరకు ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ సింగ్ కు దుశ్శాలువా కప్పి సన్మానించారు.

అనంతరం, మీడియాతో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వదేశీ దర్శన్, ప్రసాదం స్కీమ్ ల కింద రూ.900 కోట్లు కేటాయించాలని కోరుతూ ప్రపోజల్స్ సమర్పించామని అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ స్కీమ్ ల కింద అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని, తమ ప్రపోజల్స్ కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. అమరావతిలో లేదా విశాఖలో టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ ను త్వరలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, ఈ మీట్ కు ప్రహ్లాద్ సింగ్ ను రావాలని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో విజయవాడలో కూల్చేసిన ఇరవై నాలుగు దేవాలయాలను తిరిగి ‘రీ అసెంబుల్’ చేసే నిమిత్తం ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరామని, ఇందుకు ఆయన పాజిటివ్ గా స్పందించారని చెప్పారు.

More Telugu News