Andhra Pradesh: ఏపీ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సిందే!: సీఎం జగన్ స్పష్టీకరణ

  • ఇందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి
  • నైపుణ్యవంతులైన మానవవనరులను అభివృద్ధి చేయాలి
  • తాడేపల్లిలో పారిశ్రామిక రంగంపై సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్ లోని పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇతర మంత్రులు అనిల్ కుమార్, బొత్స, లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని పునరుద్ఘాటించారు.

ఈ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనివల్లే రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వగలమని చెప్పారు.

  • Loading...

More Telugu News