Koneru Satyanarayana: టీడీపీకి కోనేరు సత్యనారాయణ గుడ్ బై

  • బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన కోనేరు
  • జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక
  • తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్య

తెలుగుదేశం పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈనెల 18న హైదరాబాదులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. అమిత్ షా హైదరాబాదుకు వచ్చినప్పుడు ఆయనను కలుసుకున్నానని... బీజేపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయనకు చెప్పానని అన్నారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని... అందుకే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. 30 ఏళ్లుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంపుకుంటున్నానని కొంత భావోద్వేగానికి గురయ్యారు.

  • Loading...

More Telugu News