Indian Air Force: బాలాకోట్ పై బాంబుల వర్షం కురిపించిన ఎయిర్ ఫోర్స్ పైలట్లకు అరుదైన గౌరవం

  • బాలాకోట్ లో జైషే మొహమ్మద్ స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత వాయుసేన
  • ఒక వింగ్ కమాండర్, నలుగురు స్క్వాడ్రన్ లీడర్లకు వాయుసేన గ్యాలెంట్రీ మెడల్స్
  • పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్ దాడి

పాకిస్థాన్ భూభాగంలో ఉన్న బాలాకోట్ లో జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి, ధ్వంసం చేసిన భారత వాయుసేన పైలట్లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వింగ్ కమాండర్ అమిత్ రంజన్, స్క్వాడ్రన్ లీడర్లు రాహుల్ బసోయా, పంకజ్ భుజాడే, బీకేఎన్ రెడ్డి, శంశాంక్ సింగ్ లను భారత ప్రభుత్వం వాయుసేన గ్యాలెంట్రీ మెడల్స్ తో సత్కరించనుంది. వీరంతా కూడా మిరేజ్-2000 యుద్ధ విమానాలతో జైషే ఉగ్ర స్థావరాలపై దాడి చేశారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసిన టెర్రరిస్టులు 40 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తీవ్రంగా ప్రతిస్పందించినన భారత్... వాయుసేనతో దాడులు చేయించింది.

More Telugu News