Asaduddin Owaisi: వరద బాధితులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ విరాళం

  • కేరళ, మహారాష్ట్రలను కుదిపేసిన వరదలు
  • భారీ సంఖ్యలో ప్రాణ నష్టం
  • రూ.20 లక్షల విరాళం ప్రకటించిన అసద్
కేరళ, మహారాష్ట్రలోని వరద బాధితులకు తనవంతు సాయం అందించేందుకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముందుకొచ్చారు. రెండు రాష్ట్రాలకు పదేసి లక్షల రూపాయల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ సొమ్మును పంపనున్నట్టు తెలిపారు.

కేరళ, మహారాష్ట్రలను ఇటీవల భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా కేరళలో 91 మంది, మహారాష్ట్రలో 59 మంది మృతి చెందారు. వేలాదిమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు. రెండు రోజుల క్రితం నటి జెనీలియా దంపతులు రూ.25 లక్షల విరాళం అందించారు. తెలుగు చిత్రసీమకు చెందిన సంపూర్ణేశ్ బాబు కర్ణాటక వరద బాధితులకు తనవంతు సాయంగా రెండు లక్షల సాయాన్ని ప్రకటించాడు. మరెందరో ప్రముఖులు కూడా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.
Asaduddin Owaisi
MIM
kerala
Maharashtra
floods

More Telugu News