Varla Ramaiah: 74 రోజుల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మీదే... చూద్దాం ఏం జరుగుతుందో!: వర్ల రామయ్య

  • ఏపీ సర్కారుపై వర్ల విమర్శలు
  • గతంలో ఎవరికీ ఈ స్థాయిలో వ్యతిరేకత రాలేదంటూ ట్వీట్
  • పాలన పట్ల అవగాహన లేమి కారణం కావొచ్చంటూ వ్యాఖ్యలు
టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ సర్కారు తీరుతెన్నులపై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన, 74 రోజుల స్వల్ప వ్యవధిలో ఇంతటి ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. గతంలో ఆరణాల కూలీ సీఎంగా వ్యవహరించినా ఇంత చెడ్డపేరు రాలేదని, అసమర్థులుగా పేరుపడిన వాళ్లు పాలించినా ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించలేదని పేర్కొన్నారు. "ఈ పరిస్థితికి కారణం మీ అవగాహన లేమి, ఎవరిమాట వినని మీ నైజం కావొచ్చు... చూద్దాం!" అంటూ వర్ల రామయ్య ఘాటుగా ట్వీట్ చేశారు.
Varla Ramaiah
Jagan
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News