Nara Lokesh: జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్టుపై నారా లోకేశ్ ట్వీట్

  • పాత్రికేయుడ్ని చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేదంటూ వ్యాఖ్య
  • ప్రజల తరఫున ప్రశ్నించిన ఎమ్మెల్యే రాపాకను అరెస్ట్ చేశారన్న లోకేశ్
  • ఏమిటీ నియంతృత్వం? అంటూ మండిపాటు
మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి వ్యవహారంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఓ పాత్రికేయుడ్ని చంపుతానంటూ బెదిరించిన ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం, ప్రజలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను మాత్రం అరెస్టు చేసిందని ట్వీట్ చేశారు. అధికారం ఉంది కదా అని ఎంతటి దౌర్జన్యానికైనా తెగబడవచ్చని భావిస్తున్నారని, అదే సమయంలో ప్రతిపక్షం న్యాయం అడగడం కూడా తప్పయిపోయిందని, ఏమిటీ నియంతృత్వం? అంటూ ధ్వజమెత్తారు.
Nara Lokesh
Jana Sena
Rapaka

More Telugu News