IIT: తిరుపతి ఐఐటీ మొదటి స్నాతకోత్సవంలో ప్రోటోకాల్ వివాదం!

  • తమ పట్ల ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదంటూ ప్రజాప్రతినిధుల అలక
  • కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
  • ఐఐటీ అధికారులు కనీస గౌరవం ఇవ్వలేదని ఎంపీ ఆరోపణ
ఐఐటీ తిరుపతి ప్రాంగణంలో మొదటి స్నాతకోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఐఐటీ అధికారుల తీరును ప్రజాప్రతినిధులు తప్పుబట్టారు. తమ పట్ల ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదని అలకబూనిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఐఐటీ అధికారులు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఆహ్వానపత్రంలో తమ పేర్లు కూడా కరెక్ట్ గా రాయలేదని వాపోయారు. తిరుపతికి ఐఐటీ వచ్చిందేమో కానీ, ఇందులో ఏపీ విద్యార్థులెవరూ లేరని విమర్శించారు.
IIT
Tirupati

More Telugu News