Nagarjuna Sagar: సాగర్ వద్ద నదిలో స్నానానికి దిగి, కొట్టుకుపోయిన యువకుడు... వీడియో!

  • నాగార్జున సాగర్ సందర్శనకు పోటెత్తిన ప్రజలు
  • జహీరాబాద్ నుంచి స్నేహితులతో వచ్చిన వ్యక్తి
  • చూస్తుండగానే నీళ్లల్లో కొట్టుకుపోయిన వైనం
నాగార్జుసాగర్‌ డ్యామ్‌ వద్ద ఉగ్ర కృష్ణమ్మ, ఓ యువకుడిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే, సాగర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం ప్రారంభమైన తరువాత, సందర్శకుల తాకిడి ఎక్కువకాగా, జహీరాబాద్ కు చెందిన నరసింహం అనే వ్యక్తి, తన స్నేహితులతో కలిసి వచ్చాడు. అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగారు. నదిలో ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద స్నానానికి దిగారు. ఈలోగా నరసింహం నీటి ఉద్ధృతికి కొంతదూరం వెళ్లిపోయాడు. అక్కడి నుంచి తిరిగి గట్టునకు చేరుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు.

అయితే నీటి ప్రవాహం అతని ప్రయత్నానికి అడ్డుగా నిలిచి, నెమ్మదిగా మరింత దూరానికి తీసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ చూస్తున్న మిగతా సందర్శకులు గట్టిగా అరుస్తూ, సహాయం కోసం ప్రయత్నించినా, సమీపంలో రెస్క్యూ టీమ్ అందుబాటులో లేకపోయింది. చూస్తుండగానే, అతను నీటిలో మునిగి అదృశ్యమయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పలువురు తమ స్మార్ట్ ఫోన్లలో బంధించగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చూస్తున్న వారి గుండెలను ద్రవింపజేస్తున్నాయి.
Nagarjuna Sagar
Flood
Water
Krishna River

More Telugu News