Ayushmann Khurrana: ఐదు నిమిషాల్లో 40 మిస్‌డ్ కాల్స్ వచ్చాయి: ఆయుష్మాన్ ఖురానా

  • మొట్టమొదట విక్కీ కౌశల్ ఫోన్ చేశాడు
  • అతడిలో బోల్డంత ప్రతిభ దాగి ఉంది
  • జాతీయ అవార్డు రావడమంటే బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయినట్టే

తనకు జాతీయ అవార్డు ప్రకటించాక ఐదు నిమిషాల్లో 40 మిస్‌డ్ కాల్స్ వచ్చాయని బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా వెల్లడించాడు. ఆయుష్మాన్ నటించిన ‘అంధాధున్’ సినిమాకు గాను అతడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. తనకు జాతీయ అవార్డు రావడంపై ఆయుష్మాన్ సంతోషం వ్యక్తం చేశాడు. అవార్డులు ప్రకటించిన సమయంలో తాను షూటింగ్‌లో ఉన్నానని గుర్తు చేసుకున్నాడు. ఐదు నిమిషాల తర్వాత తన ఫోన్ చూసుకుంటే అందులో 40 మిస్‌డ్ కాల్స్, మెసేజ్‌లు ఉన్నాయన్నాడు. వాటిని చూశాకే తనకు అవార్డు వచ్చిందన్న విషయం తెలిసిందన్నాడు.

తనకు జాతీయ అవార్డు వచ్చిన తర్వాత మొట్టమొదట విక్కీ కౌశల్ పోన్ చేసినట్టు ఖురానా పేర్కొన్నాడు. అతడో ముత్యం లాంటి వాడని, అతడిలో గొప్ప ప్రతిభ దాగి ఉందని ప్రశంసించాడు. అవార్డును అతడితో కలిసి పంచుకుంటానని తెలిపాడు. ఇద్దరం పంజాబీలమేనని, తామెప్పుడు కలిసినా పంజాబీలోనే మాట్లాడుకుంటామని గుర్తు చేసుకున్నాడు. మామూలు అవార్డులతో పోలిస్తే జాతీయ అవార్డుకు ఉన్న తేడా ఏంటన్న ప్రశ్నకు ఖురానా స్పందిస్తూ.. ‘ఇది బోర్డ్ ఎగ్జామ్ పాస్ కావడం లాంటిది’ అని బదులిచ్చాడు.

More Telugu News