Piyush Goyal: ఇక మన రైళ్లు మరింత వేగం: పీయుష్ గోయల్

  • 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఇంజన్లు
  • హై స్పీడ్ రైల్ ఇంజన్ల తయారీ
  • చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో పనులు
సమీప భవిష్యత్తులోనే దేశంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగల హైస్పీడ్ రైల్ ఇంజన్ల తయారీని ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, రైళ్లలో ప్రయాణించేవారు, మరింత తక్కువ సమయంలోనే తమతమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూడటమే తమ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్స్క్ ప్రాంగణంలోనే ఈ రైల్ ఇంజన్ల తయారీ జరుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా వీటి తయారీ ఉంటుందన్నారు.
Piyush Goyal
Train
High Speed

More Telugu News