Hyderabad: తెలంగాణలో నేడు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

  •  వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం
  • వెల్లడించిన వాతావరణ శాఖ

తెలంగాణలో నేడు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఈ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.  తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమబెంగాల్‌ తీరాన్ని ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలు రెండు రోజులుగా తెరిపినిచ్చాయి. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సూర్యుడు దర్శనమిచ్చాడు. 

More Telugu News