Rajtarun: రాజ్ తరుణ్ చేతిలో కొత్త ప్రాజక్టులు

  • వరుస ఫ్లాపులతో వెనుకబడిన రాజ్ తరుణ్ 
  • విడుదలకి సిద్ధమవుతోన్న సినిమా ఒకటి
  •  సెట్స్ పైకి వెళ్లే ప్రాజెక్టులు మూడు
ఆ మధ్య వరుస సినిమాలతో సందడి చేసిన రాజ్ తరుణ్, ఇటీవల కాలంలో తెరపై కనిపించలేదు. తన తోటి కథానాయకుల నుంచి విపరీతమైన పోటీ ఉండటం .. తను చేసిన సినిమాలు నిరాశ పరుస్తూ ఉండటంతో రాజ్ తరుణ్ ఆలోచనలో పడ్డాడట. ఇలా అయితే కష్టమని భావించి, కథల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని మళ్లీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన చేస్తోన్న సినిమా కాకుండా ఆయన చేతిలో మరో మూడు సినిమాలు వున్నట్టుగా సమాచారం. జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాలో ఆయన జోడీగా షాలినీ పాండే నటిస్తోంది. ఈ సినిమా తరువాత ఆయన అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా .. మారుతి నిర్మాణంలో ఒక సినిమా .. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా సమాచారం. ఈ నాలుగింటిలో రెండు హిట్లు పడినా రాజ్ తరుణ్ మళ్లీ రేస్ లోకి వచ్చేస్తాడు.
Rajtarun
Shalini Pandey

More Telugu News