Andhra Pradesh: నా పాత్రికేయ మిత్రుడు తాతాజీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా!: నారా లోకేశ్ ఆవేదన

  • రిపోర్టర్ గా ప్రజల కోసం చాలా కష్టపడ్డాడు
  • దాన్ని నేను స్వయంగా చూశాను
  • ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా
తన పాత్రికేయ మిత్రుడు తాతాజీ చనిపోవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాతాజీ మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రిపోర్టర్ గా ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఆయన చాలా కష్టపడ్డారని లోకేశ్ తెలిపారు. ఆయన కష్టాన్ని తాను చాలాసార్లు స్వయంగా చూశానని చెప్పారు. తాతాజీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Twitter
media friend
tataji
death

More Telugu News