Pakistan: భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకున్న ఫలితం.. పాక్‌లో కిలో టమాటా రూ.300!

  • కశ్మీరీలకు సంఘీభావంగా భారత్‌తో వాణిజ్య సంబంధాలు కట్
  • నిత్యావసరాల ధరలకు రెక్కలు
  • దేశం కోసం నష్టాన్ని భరిస్తామంటున్న పాక్ వ్యాపారులు
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంది. కశ్మీరు ప్రజలకు సంఘీభావంగా వాణిజ్య సంబంధాలను కూడా తెంచేసుకుంది. ఫలితంగా భారత్ నుంచి కూరగాయలు, నిత్యావసరాల సరఫరా నిలిచిపోయింది. ఇమ్రాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆ దేశ ప్రజలకు శాపంగా మారింది.

భారత్ నుంచి నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇక, టమాటాల ధర అయితే ఆకాశాన్నంటింది. కిలో టమాటల ధర ఏకంగా రూ.300కు చేరింది. వీటితో పాటు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నా అవి సరిపోవడం లేదు. కాగా, భారత్‌తో వాణిజ్య పరమైన సంబంధాలు తెంచుకోవడంపై పాక్ వ్యాపారాలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. తమకు నష్టమే అయినా దేశం కోసం భరిస్తామని చెబుతున్నారు.
Pakistan
tomato
business
Jammu And Kashmir
article 370

More Telugu News