Rangasthalam: వరద నీటిలో చిక్కుకుని అల్లాడిపోతున్న 'రంగస్థలం' గ్రామం

  • గోదావరి వరద గుప్పిట్లో తూర్పుగోదావరి జిల్లా పూడిపల్లి  
  • 12 రోజులుగా ముంపులోనే గ్రామం
  • ప్రభుత్వసాయంపైనే ఆధారపడిన గ్రామస్తులు
రామ్ చరణ్ కెరీర్ లో తిరుగులేని హిట్ రంగస్థలం చిత్రం. ఈ సినిమాలో గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా కోసం అనేక సన్నివేశాలను తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పూడిపల్లి గ్రామంలో చిత్రీకరించారు. దాంతో రంగస్థలం గ్రామంగా ఈ ఊరికి విపరీతమైన ప్రచారం లభించింది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో పూడిపల్లి గ్రామం విలవిల్లాడుతోంది.

గత 12 రోజులుగా పూడిపల్లి వరద గుప్పిట్లో చిక్కుకుపోయింది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గ్రామానికి బయటి ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయాయి. ప్రభుత్వం అందించే సాయంపైనే ఇక్కడి కుటుంబాలు ఆధారపడ్డాయి. అయితే, ప్రభుత్వ సాయం తమకు సంతృప్తికరంగా లేదని, ఉడికీ ఉడకని ఆహారం తినలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.
Rangasthalam
Pudipalli
East Godavari District

More Telugu News