eremy Corbyn: కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది!: బ్రిటన్ లేబర్ పార్టీ అధినేత జెరిమీ కోర్బిన్

  • కశ్మీర్ పరిస్థితులు కలవరపరస్తున్నాయి
  • మానవహక్కుల ఉల్లంఘన ఆమోదనీయం కాదు
  • ట్విట్టర్ లో స్పందించిన బ్రిటన్ ప్రతిపక్ష నేత

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్ ను లడఖ్, జమ్మూకశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు తలెత్తకుండా భారీ సంఖ్యలో సాయుధ బలగాలను మోహరించింది. ఈ విషయమై తాజాగా బ్రిటన్ ప్రతిపక్ష నేత, లేబర్ పార్టీ అధినేత జెరిమీ కోర్బిన్ అసహనం వ్యక్తం చేశారు.

‘జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అక్కడే మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఇది ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. కశ్మీరీ ప్రజల హక్కులను గౌరవించాల్సిందే. జమ్మూకశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలుచేయాలి’ అని కోర్బిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News