Andhra Pradesh: ఇంత సక్రమంగా నడుస్తున్న మీ పాలనకు జోహార్లు జగన్ గారూ!: నారా లోకేశ్ సెటైర్లు

  • జగన్ ప్రభుత్వంపై లోకేశ్ ఆగ్రహం
  • సామాన్యులకు పనులు దొరకట్లేదని విమర్శ
  • పేదలు తమ పిల్లల్ని పస్తులతో పడుకోబెడుతున్నారని ఆగ్రహం
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. చాలామంది కార్మికులు పనులు దొరక్క తమ పిల్లలను పస్తులు పడుకోబెడుతున్నారని లోకేశ్ తెలిపారు. అదే సమయంలో వైసీపీ నేతలు ఇసుక అమ్మకాలతో డబ్బుల మూటలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత సక్రమంగా సాగుతున్న సీఎం జగన్ పాలనకు జోహార్లు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
YSRCP
Jagan
Twitter
sand policy
poor
no work

More Telugu News