Andhra Pradesh: జగన్ అడుగుజాడల్లో కర్ణాటక సీఎం.. మా ఉద్యోగాలు మాకే అంటున్న యడియూరప్ప!

  • ఏపీలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేనన్న ప్రభుత్వం
  • అదే తరహాలో ముందుకెళుతున్న యడియూరప్ప
  • మెజారిటీ ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జగన్ ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ బాటలోనే కర్ణాటక నడుస్తోంది. కర్ణాటకలో మెజారిటీ ఉద్యోగాలు కన్నడిగులకే దక్కాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యానించారు. ఇందుకు అనుగుణంగా తాము చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు.

క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ మేం పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతామని యడియూరప్ప చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన యడియూరప్ప.. కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే అనే హ్యాష్ ట్యాగ్ ను తన ట్వీట్ కు జతచేశారు.
Andhra Pradesh
Karnataka
Majority jobs for locals
KarnatakaJobs For Kannadigas
yediyurappa
Chief Minister

More Telugu News