Priyaanka Chopra: వేదికపై నోరు పారేసుకున్న పాక్ అమ్మాయి నోరు మూయించిన ప్రియాంకా చోప్రా... వీడియో!

  • లాస్ ఏంజిల్స్ లో 'బ్యూటీకాన్' సదస్సు
  • పాల్గొన్న ప్రియాంకను అరుస్తూ ప్రశ్నలు
  • దీటైన సమాధానం ఇచ్చిన బ్యూటీ
వేదికపై ఉన్న తనను ఉద్దేశించి, నోరు పారేసుకున్న ఓ పాకిస్థానీ యువతి నోరు మూయించింది నటి ప్రియాంకా చోప్రా, లాస్ ఏంజిల్స్ లో జరిగిన 'బ్యూటీకాన్' సదస్సులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

"ఇండియా సైన్యం పాక్ లో వైమానిక దాడులు చేసిన సమయంలో మీరు 'జై హింద్' అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ ప్రతినిధిగా ఉన్న మీరు అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవచ్చా? ఓ పాక్ మహిళగా, నేను మీ మంచి పనులకు మద్దతుగా నిలిచాను. మీరు మాత్రం మా దేశంపై యుద్ధానికి దారి తీసే వ్యాఖ్యలు చేయడం సరైనదేనా?" అంటూ కేకలు పెట్టింది.

దీనికి సమాధానం ఇచ్చిన ప్రియాంక, "నాకు పాక్ లో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. నేను ఇండియన్ ను. ఇండియా పట్ల నాకు గౌరవము, బాధ్యత ఉంది. నేను ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. నీ దేశం కోసం నువ్వెలా ప్రశ్నిస్తున్నావో, నేనూ అంతే. ఇలా అరిచి నీ పరువు తీసుకోకు" అంటూ బుద్ధి చెప్పింది. ప్రపంచంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సి వుందని, మహిళలే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలని ఈ సందర్భంగా ప్రియాంక సూచించింది.
Priyaanka Chopra
Losangels
Beautycon
Pakistani Girl

More Telugu News