Andhra Pradesh: ఏపీ గోశాలలో 100 ఆవుల మృతి.. కచ్చితంగా కుట్ర ఉందన్న ఎమ్మెల్యే రాజా సింగ్!

  • స్థలం గొడవ, గోశాలలో గ్రూపులు ఉన్నాయని వ్యాఖ్య
  • కొన్ని దుష్టశక్తులు గోశాలపై కన్నేశాయని వెల్లడి
  • హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే
విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు ఆనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆవుల కళేబరాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన వెటర్నరీ వైద్యులు.. విషప్రభావం కారణంగానే మూగజీవాలు చనిపోయాయని తేల్చారు. దీంతో ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఉందని పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘ఇంత పెద్ద సంఖ్యలో ఆవులు ఒకేసారి చనిపోయాయంటే అక్కడ కుట్ర కోణం ఉంది. మాకున్న సమాచారం ప్రకారం స్థానికంగా గోశాల స్థలంపై  గొడవ ఉంది. ఇక్కడి భూమి ఖరీదుగా మారిపోవడంతో కొన్ని దుష్టశక్తుల కన్ను ఆ గోశాలపై పడింది. ఆ గోశాలలో కూడా రెండు గ్రూపులు ఉన్నాయని తెలిసింది. ఈరోజు లేదా రేపు మేం గోశాలను సందర్శిస్తాం’ అని రాజాసింగ్ తెలిపారు.
Andhra Pradesh
gopsala
100 cows
dead
MLA
BJP
rajasingh

More Telugu News