Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో వైసీపీ-టీడీపీ శ్రేణుల ఘర్షణ.. పికెట్ ఏర్పాటుచేసిన పోలీసులు!

  • పర్చూరు మండలం నూతలపాడులో ఘటన
  • వాగ్వాదం కాస్తా గొడవగా మారిన వైనం
  • ఇరువర్గాలకు పోలీసుల వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాలోని పర్చూరు మండలం నూతలపాడులో ఇరువర్గాల మధ్య నిన్న అర్ధరాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ఘర్షణలకు దారితీయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఈరోజు ఉదయాన్నే పోలిస్ పికెట్ ఏర్పాటుచేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు ఇరువర్గాలను హెచ్చరించారు.
Andhra Pradesh
Prakasam District
Telugudesam
YSRCP
Police
picket

More Telugu News