Drunk Driving: డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన 85 మంది

  • హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు
  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో దొరికిపోయిన మందుబాబులు
  • వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
శనివారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు, అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 85 మందిపై కేసులు పెట్టారు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ సహా పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు.  బంజారాహిల్స్ ఏరియాలో 33 కార్లు, 28 బైకులపై వస్తున్న వాహనదారులు లిమిట్ ను మించి మద్యం తాగినట్టు నిర్దారించారు. ఇదే సమయంలో సరూర్‌ నగర్ మినీ ట్యాంక్‌ బండ్‌ పై చేపట్టిన తనిఖీల్లో 17 బైకులు, 4 కార్లు, మూడు ఆటోలు, ఓ ట్రాక్టర్ ను నడుపుతూ వస్తున్న వారు అతిగా మద్యం తాగినట్టు తేల్చి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు.
Drunk Driving
Hyderabad
Banjarahills
Police
Vehicles

More Telugu News