Hyderabad: కులుమనాలిలో పారాచ్యూట్ తో విహరిస్తూ హైదరాబాద్ వైద్యుడు దుర్మరణం

  • విహారయాత్ర కోసం కులుమనాలి వెళ్లిన డాక్టర్ చంద్రశేఖర్
  • పారాచ్యూట్ తో గాల్లో విహరించే ప్రయత్నంలో కిందపడిన వైనం
  • కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి విషాదకర రీతిలో కులూమనాలిలో ప్రాణాలు వదిలారు. హైదరాబాద్ లోని నాగోలు మోహన్ నగర్ ప్రాంతంలో నివసించే చంద్రశేఖర్ రెడ్డి ఓ వైద్యుడు. కొన్నిరోజుల క్రితం విహారయాత్ర నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ కులుమనాలి వెళ్లారు. అక్కడ పారాచ్యూట్ తో గాల్లో విహరించేందుకు చేసిన ప్రయత్నం విషాదాంతంగా మారింది. పారాచ్యూట్ గాల్లోకి లేచిన తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి దానిపై నియంత్రణ కోల్పోయారు. ఫలితంగా ఆయన గాల్లోంచి కిందపడిపోవడంతో బలమైన దెబ్బలు తగిలి మరణించారు. ఈ సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Hyderabad
Doctor
Parachute

More Telugu News