Jana sena: నాపై వస్తున్న వదంతులు చూసి ఆశ్చర్యపోయా: ‘జనసేన’ నేత వీవీ లక్ష్మీనారాయణ

  • ఓ నానుడిని ప్రస్తావించిన లక్ష్మీనారాయణ
  • గిట్టని వాళ్లు వదంతులు సృష్టిస్తారు
  • మూర్ఖులు వాటిని వ్యాపింపజేస్తారు
  • తెలివి తక్కువ వ్యక్తులు వాటిని ఆమోదిస్తారు
జనసేన పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడుతున్నారన్న వదంతులు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈరోజు ఉదయం నుంచి తనపై వస్తున్న ఈ వదంతుల గురించి తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. ‘గిట్టని వాళ్లు వదంతులు సృష్టిస్తారు. మూర్ఖులు వాటిని వ్యాపింపజేస్తారు. తెలివి తక్కువ వ్యక్తులు వాటిని ఆమోదిస్తారు’ అని చెప్పే ఓ నానుడిని ఆయన ప్రస్తావించారు. ఏ కేటగిరీకి చెందుతారో వాళ్లే నిర్ణయించుకోవాలని సూచించారు. పార్టీకి ఎంత వరకూ తాను ఉపయోగపడతానని ‘జనసేన’ అధ్యక్షుడు భావిస్తారో, అంత వరకూ ఆ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. దయచేసి, ఇలాంటి వదంతులను సృష్టించేందుకు కాకుండా, వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించేందుకో, మొక్కలు నాటేందుకో.. మరిన్ని మంచి పనులు చేసేందుకో సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Jana sena
Pawan Kalyan
vv lakshmi narayana
Ex Jd

More Telugu News