National awards-66: జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కు కేటీఆర్ శుభాకాంక్షలు

  • తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రతిభావంతులను జ్యూరీ గుర్తించింది
  • ‘రంగస్థలం’యూనిట్, ‘ఆ! టీమ్ కు శుభాకాంక్షలు
  • అవార్డు విజేతలందరికీ శుభాకాంక్షలు
జాతీయ చలన చిత్రాల పురస్కారాలలో టాలీవుడ్ కు అవార్డులు రావడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఓ ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతిభావంతులను జ్యూరీ గుర్తించి, గౌరవించిందని అన్నారు. జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన కీర్తి సురేశ్ కు, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘మహానటి’ చిత్రయూనిట్ కు, చి.ల.సౌ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్ర, ‘రంగస్థలం’ చిత్రయూనిట్ తో పాటు ‘ఆ! టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 
National awards-66
Mahanati
Keerthy Suresh

More Telugu News