మళ్లీ రాహులే రావాలి... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదీ అదే మాట!
- ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కొనసాగాలంటున్న వర్కింగ్ కమిటీ
- మత తత్వ పార్టీలు పెచ్చరిల్లుతున్న తరుణంలో కాంగ్రెస్ ను, దేశాన్ని కాపాడేది రాహుల్ ఒక్కడేనంటూ ఏక వాక్య తీర్మానం
- ఈ రాత్రికి మరోసారి సమావేశం కానున్న సీడబ్ల్యూసీ
అయితే, తమ నిర్ణయంపై రాహుల్ ఏమంటాడోనన్న అంతర్మధనంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాత్రి 8 గంటలకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దారుణ ఫలితాలు చవిచూసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన మనసు మార్చడానికి కాంగ్రెస్ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదు.