Bihar: కశ్మీర్ అమ్మాయిలపై హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

  • గతంలోనూ అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు 
  • తెల్లని కశ్మీరీ అమ్మాయిలంటూ బీజేపీ ఎమ్మెల్యే సైనీ కూడా..
  • బీజేపీలోని బ్యాచిలర్ నాయకులందరూ కశ్మీర్ వెళ్లాలని సూచన

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చెప్పేవారని, ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సీఎం స్పందిస్తూ.. యువతీ యువకుల మధ్య పరస్పర అంగీకారంతో ఇవి జరుగుతాయని, అయితే ఒకసారి వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత తనపై అత్యాచారం జరిగిందంటూ అమ్మాయిలు కేసులు పెడతారని అన్నారు. దాదాపు 80-90 శాతం కేసుల్లో ఇదే జరుగుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.
 
కాగా, బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కూడా కశ్మీర్ యువతుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు కావడంతో ఇకపై తెల్లని కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడవచ్చని అన్నారు. అంతేకాదు, బీజేపీలోని అవివాహిత నాయకులు కశ్మీర్ వెళ్లి ప్లాట్లు కొనుక్కుని పెళ్లిళ్లు చేసుకోవచ్చని సూచించారు.

More Telugu News