kakani govardhan reddy: మందుకొట్టి వచ్చిన కానిస్టేబుల్.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంట్లో హల్‌చల్!

  • పూటుగా తాగొచ్చి ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబాటు
  • ఎమ్మెల్యే పీఏ విధులకు ఆటంకం
  • దుర్భాషలాడుతూ హల్‌చల్
సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన హెడ్‌కానిస్టేబుల్ నానాయాగీ చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉదయగిరిలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జేమ్స్ శుక్రవారం మధ్యాహ్నం పూటుగా తాగి నెల్లూరు డైకస్ రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటికెళ్లాడు. ఆవరణలో ఉన్న వారిని తిడుతూ నానా హంగామా చేశాడు. ఎమ్మెల్యే పీఏ సుజిత్ విధులకు ఆటంకం కలిగించాడు.

కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న పోలీసులు కానిస్టేబుల్ జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పీఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
kakani govardhan reddy
sarvepalli
Nellore District
constable

More Telugu News