Jammu And Kashmir: పటేల్ పుట్టిన రోజున రెండు ముక్కలుగా విడిపోనున్న జమ్ముకశ్మీర్

  • అక్టోబర్ 31న పటేల్ 144వ జయంతి
  • ఆ రోజున రెండు ముక్కలు కానున్న జమ్ముకశ్మీర్
  • జమ్ముకశ్మీర్, లడఖ్ యూటీలుగా రూపాంతరం 

జమ్ముకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోనున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆమోదముద్ర వేశారు. జమ్ముకశ్మీర్ విభజనకు డేట్ ఫిక్సయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి రోజైన అక్టోబర్ 31న జమ్ముకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోనుంది. జమ్ముకశ్మీర్, లడఖ్ యూటీలుగా మారనున్నాయి. మరోవైపు, జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 కూడా రద్దైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్ లోయ భద్రతాబలగాల కనుసన్నల్లో ఉంది. ప్రజల సౌకర్యార్థం సెక్షన్ 144ని ఎత్తేశారు.

More Telugu News