Gautam Sawang: ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

  • విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • ఐబీ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్నామన్న డీజీపీ
  • ఏపీకి ముప్పు లేకున్నా భద్రత విషయంలో రాజీపడేది లేదన్న సవాంగ్
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆగస్టు 15 పరేడ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా భద్రత విషయంలో రాజీపడబోవడంలేదని స్పష్టం చేశారు.
Gautam Sawang
DGP
Andhra Pradesh

More Telugu News