Guntur District: ఈ నెల 14నుంచి మంగళగిరిలో ‘జనసేన’ సమావేశాలు

  • 14 నుంచి 16 వరకు సమావేశాలు
  • ఈ సమావేశాల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్
  • కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఈ నెల 14వ తేదీ నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశాలు నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘జనసేన’ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటన వెలువడింది. 14వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధి, 16వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ పార్లమెంట్ పరిధి, మధ్యాహ్నం మూడు గంటలకు మచిలీపట్నం పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధులలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు జరుగుతాయని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేస్తారని తెలిపింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, ‘జనసేన’ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ, ముఖ్యనాయకులు పాల్గొంటారని తెలిపింది.
Guntur District
Mangalagiri
Janasena
pawan kalyan

More Telugu News