భూటాన్ పర్యటనకు వెళ్లనున్న మోదీ

  • ఈ నెల 17న భూటాన్ వెళ్లనున్న మోదీ
  • రెండు రోజుల పర్యటన 
  • మోదీని ఆహ్వానించిన భూటాన్ ప్రధాని
ఈ నెల 17న ప్రధాని మోదీ భూటాన్ కు పయనమవుతున్నారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. భూటాన్ ప్రధాని లొటయ్ త్సెరింగ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడకు వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యేల్ వాంగ్ చుక్, మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్ చుక్ లతో మోదీ సమావేశమవుతారు. ఆ దేశ ప్రధానితో భేటీ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. భూటాన్ తో భారత్ కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మరోసారి చాటిచెప్పేలా మోదీ భూటాన్ పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం అనేది మోదీ నినాదమన్నది తెలిసిందే. ఇందులో భాగంగానే తాను రెండో సారి ప్రధాని అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే మోదీ భూటాన్ కు వెళ్తున్నారు.
Go Back to Shorts
Modi
Bhutan
Tour
BJP

More Telugu News