boat accident: గోదావరిలో మత్స్యకారుల పడవలు బోల్తా.. తప్పిన ప్రమాదం

  • ఈదుకుంటూ ఎగువ కాఫర్‌ డ్యాం వద్దకు చేరుకున్న బాధితులు
  • వారిని ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు
  • 18 పడవల్లో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
గోదావరి నది భారీ వరదలో చిక్కుకున్న మత్స్యకారులకు తృటిలో ప్రమాదం తప్పింది. ధవళేశ్వరానికి చెందిన 31 మంది మత్స్యకారులు 18 పడవల్లో చేపల వేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్దకు వచ్చేసరికి వరద తీవ్రత ఎక్కువ కావడంతో ఇందులో రెండు పడవలు గల్లంతయ్యాయి.

అయితే రెండు పడవల్లో ఉన్నవారు, మిగతా పడవల్లో వారితోపాటు సురక్షితంగా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పైకి చేరుకున్నారు. కానీ చుట్టూ వరద నీరు ప్రవహిస్తుండడంతో వారికి ఒడ్డుకు వచ్చే మార్గం మూసుకుపోయింది. దీంతో బాధితులంతా తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మత్స్యకారులను ఒడ్డుకు తెచ్చేందుకు ఎస్ ఐ ఆర్‌.శ్రీను, సీఐ ఎ.ఎన్‌.మూర్తిలు సహాయక చర్యలు చేపట్టారు.
boat accident
polavaram copper dam
fishermen safe

More Telugu News